- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gas Rates Today: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
దిశ, ఫీచర్స్: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఓ చిన్న శుభవార్త కూడా తీసుకువచ్చింది. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తారని తెలిసిన విషయమే. కాగా గత కొన్ని నెలల నుంచి కొనసాగుతోన్న19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను ఇటీవలే తగ్గించారు. నూతన సంవత్సరం సందర్భంగా నిన్న ఢిల్లీలో, ముంబైలో, కోల్‌కతాలో , చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు చమురు కంపెనీలు తెలిపాయి.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. సామాన్యులు ఉపయోగించే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎన్నికల ఏడాది కావడంతో గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావించారు. కానీ వారికి నిరాశ తప్పలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల సంవత్సరంలో జనవరి 1 నాడు 14కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.120.50 తగ్గిన విషయం తెలిసిందే. కాగా నేడు గ్యాస్ సలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్: రూ. 966
వరంగల్: రూ. 974
విశాఖపట్నం: రూ. 912
విజయవాడ: రూ. 927
గుంటూరు: రూ. 944