IT companies: జీతాల పెంపును సింగిల్ డిజిట్‌కి పరిమితం చేసిన ఐటీ కంపెనీలు

by S Gopi |
IT companies: జీతాల పెంపును సింగిల్ డిజిట్‌కి పరిమితం చేసిన ఐటీ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వరుసగా రెండేళ్ల పాటు రెండంకెల స్థాయిలో జీతాలు పెరిగిన తర్వాత దేశీయ ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులు ఈ ఏడాది సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. క్లయింట్లు ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఉన్న నిధులనే పరిమితంగా వాడాలని నిర్ణయించడం వంటి కారణాలతో దేశీయంగా టాప్-5 ఐటీ కంపెనీల్లో మూడు వేతన పెంపును తగ్గించాయి. ఆర్థిక సవాళ్లు ఇందుకు ప్రధాన కారణం. దానివల్ల ఉద్యోగులకు రివార్డులు ఇచ్చే విషయంలోనూ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చాలామంది ఐటీ నిపుణులు (అత్యుత్తమ పనితీరు ఉన్న వారిని మినహాయించి) జీతంలో 5-9 శాతం మధ్య పెరుగుదల చూశారు. సాధారణంగా అధిక ఇంక్రిమెంట్ ఇచ్చే ఇన్ఫోసిస్ కంపెనీ సైతం 9.9 శాతం మాత్రమే జీతాలను పెంచింది. అంతకుముదు 2022-23లో ఇన్ఫోసిస్ 14.6 శాతం వేతనాన్ని పెంచింది. టీసీఎస్ సైతం అంతకుముందు పెంచిన 10.5 శాతంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతం సగటు పెంపును మాత్రమే అమలు చేసింది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ కూడా 6.8 శాతం నుంచి ఈసారి 5 శాతానికే వేతన పెంపును పరిమితం చేశాయి.



Next Story