- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే బడ్జెట్.. బడ్జెట్ గురించి విశేషాలివే!
దిశ, బిజినెస్ బ్యూరో: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సమగ్ర బడ్జెట్‌ను గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని మోడీ వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి ప్రకటనలు ఉండనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రైతులు, మహిళలకు ప్రకటనలు ఉంటాయనే అంచనాలున్నాయి. ఇంకా అనేక వర్గాల నుంచి డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ నెరవేరువేతనజీవులకు ఈసారైనా ఊరట దక్కుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం, గ్రామీణ భారం, ఉద్యోగాల కల్పన, తయారీ, ఎంఎస్‌ఎంఈలకు మద్దతు, నైపుణ్యాభివృద్ధి సహా అనేక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందనే ఆశలున్నాయి.
నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా ఏడవ బడ్జెట్ కావడం విశేషం. అంతేకాకుండా 7 కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన మొదటి కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కనున్నారు. 2019, మే 31న ఆర్థిక మంత్రిగా ప్రధాని మోడీ రెండో టర్మ్‌లో బాధ్యతలు తీసుకున్న నిర్మలా సీతారామన్ ఆ ఏడాది తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం 2020-21, 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు పూర్తి బడ్జెట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించారు. ఇప్పుడు మరోసారి సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గత ఆర్థిమంత్రి మోరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించారు. 1959-64 మధ్యకాలంలో మోరార్జీ దేశాయ్ ఐదు సమగ్ర, ఒక ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను అందించారు.
బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు..
* దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఆర్ కె షణ్ముఖం చెట్టి 1947, నవంబర్ 27న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
* అత్యధిక బడ్జెట్‌లను అందించిన ఆర్థిక మంత్రిగా మోరార్జీ దేశాయ్ రికార్డు షృష్టించారు. ఆయన ప్రధాని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రీ హయాంలో మొత్తం 10 బడ్జెట్‌లను సమర్పించారు.
* సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం: 1991లో మన్మోహన్ సింగ్ 1 గంట 45 నిమిషాల పాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు.
* అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం: 1973లో హిరూభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం చేశారు.
* బడ్జెట్‌ను సమర్పించిన మొదటి మహిళ: 1970-71లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళగా ఇందిరా గాంధీ నిలిచారు.
* హల్వా వేడుక: బడ్జెట్ తయారీ "హల్వా వేడుక"తో ప్రారంభమవుతుంది, ఇక్కడ బడ్జెట్ తయారీలో పాల్గొన్న ఆర్థిక మంత్రి, అధికారులు హల్వా (తీపి వంటకం) పంచుకోవడానికి సమావేశమవుతారు.
* బడ్జెట్ లాక్-అప్: బడ్జెట్ పత్రాలు రహస్య ప్రదేశంలో ముద్రించబడతాయి. బడ్జెట్ సమర్పించబడే వరకు సంబంధిత అధికారులు లాక్ చేయబడతారు.
* బడ్జెట్ ప్రసంగం సమయం: బడ్జెట్ ప్రసంగం సాధారణంగా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
* డిజిటల్ బడ్జెట్: 2021 నుంచి సాంప్రదాయంగా ముద్రించిన కాపీలకు బదులుగా, కేంద్ర బడ్జెట్ డిజిటల్ ఫార్మాట్‌లో సమర్పిస్తున్నారు.
* అతి పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రి: పి. చిదంబరం 46 సంవత్సరాల వయస్సులో బడ్జెట్‌ను సమర్పించిన అతి పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా రికార్డుల్లో నిలిచారు.
* 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు 2 గంటల 42 నిమిషాల పాటు మాట్లాడిన నిర్మలా సీతారామన్ సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును కలిగి ఉన్నారు.
* 1991లో 18,650 పదాలను ఉపయోగించి అత్యంత పదాలతో కూడిన ప్రసంగం చేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ రికార్డు సృష్టించారు.