Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మరోసారి వడ్డీ రేట్లు యథాతథం

by S Gopi |
Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మరోసారి  వడ్డీ రేట్లు యథాతథం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం మరోసారి వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రభుత్వం వరుసగా మూడవసారి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై వడ్డీ రేట్లను కొనసాగిస్తోంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం. 2024-25లో మూడో త్రైమాసికానికి సుకన్య సమృద్ధి పథకంలో పొదుపుపై 8.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఫ్)పై 7.1 శాతం, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్స్ స్కీమ్‌ల వడ్డీ రేట్లు 4 శాతం వద్ద కొనసాగనుంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ)పై వడ్డీ రేటు 7.7 శాతం వద్దే ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed