ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వేతనం ఎంతంటే..!

by Harish |   ( Updated:2023-06-03 09:09:02.0  )
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వేతనం ఎంతంటే..!
X

బెంగళూరు: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సలీల్ పరేఖ్ 2023 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 56.44 కోట్లను జీతంగా అందుకున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 21 శాతం తక్కువగా ఉంది. గత ఏడాది ఆయన వేతనం రూ. 71 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే తక్కువ స్టాక్ ఆప్షన్‌ల కారణంగా ఈ తేడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా జీతంలో మూల వేతనం రూ. 6.67 కోట్లు, రిటైర్‌మెంట్ ప్రయోజనాలు రూ. 45 లక్షలు, వేరియబుల్ వేతనం రూ.18.73 కోట్లుగా ఉంది. అలాగే, పరేఖ్ తన నియంత్రిత స్టాక్ యూనిట్ల(ఆర్‌ఎస్‌యు)ను వినియోగించడం ద్వారా రూ.30.6 కోట్లు సంపాదించారని ఇన్ఫోసిస్ తెలిపింది. దీంతో భారత్‌లో అత్యధిక వేతనం పొందే సీఈఓ లలో ఒకరిగా నిలిచారు. కంపెనీ ఉద్యోగుల మధ్యస్థ వేతనాలకు ఆయన వేతనం 627 రెట్లు ఎక్కువగా ఉంది.

తాజాగా కంపెనీ వాటాదారులకు రాసిన లేఖలో పరేఖ్ మాట్లాడుతూ 2023 ఆర్థిక ఏడాది కంపెనీ వ్యాపారానికి బలమైన సంవత్సరం అని, 15 శాతానికి పైగా వృద్ధి, నిర్వహణ మార్జిన్లు 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, పరిశ్రమ డిమాండ్‌కు అనుగుణంగా డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్‌లో పెట్టుబడులు, సామర్థ్యం కంపెనీని మంచి స్థితిలో నిలుపుతుందని ఆయన అన్నారు.

Also Read..

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా హెడ్‌ పునీత్ రాజీనామా!

Advertisement

Next Story

Most Viewed