ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి వ్యక్తి

by Harish |   ( Updated:2023-06-03 09:03:25.0  )
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి వ్యక్తి
X

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మొట్టమొదటి సారిగా రెండు ప్రపంచ ఆర్థిక సంస్థలు అయిన ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలకు అధిపతిగా ఉన్న మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. 63 ఏళ్ల అజయ్ ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఈ పదవికి అజయ్ బంగా‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. దీంతో ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బంగాను అత్యున్నత పదవికి 14వ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఇంతకుముందు మాస్టర్‌ కార్డ్‌ ఇంక్‌ చీఫ్‌గా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు.

ఈ సందర్భంగా “అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలను స్వీకరించినందుకు ఆయనకు శుభాకాంక్షలు. మా సంస్థల మధ్య లోతైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను, ”అని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ఒక ట్వీట్‌లో తెలిపారు. అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణె లో జన్మించారు. నెస్లే ఇండియాతో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 1996లో అమెరికాకు వెళ్లారు. 2016 లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Advertisement

Next Story