Indigo Airlines: తగ్గిన ఇండిగో ఉద్యోగుల జీతాల పెరుగుదల

by S Gopi |
Indigo Airlines: తగ్గిన ఇండిగో ఉద్యోగుల జీతాల పెరుగుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో ఉద్యోగుల సగటు వేతన పెరుగుదల గతంలో కంటే తగ్గింది. సంస్థ వార్షిక నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం ఇండిగో ఉద్యోగుల సగటు వేతన పెరుగుదల్ 4.42 శాతం పెరిగింది. ఇది అంతకుముందు 2022-23లో పెరిగిన 10.5 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే, కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన కారణంగా ఆ తర్వాత 2022-23లో వేతన వృద్ధి అధికంగా ఉందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన 4.42 శాతం మొత్తం పరిశ్రమ ప్రమాణాలకు దగ్గరగా ఉందని వారు తెలిపారు. ఇదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 13.7 శాతం పెరిగి 36,860కి చేరింది. ఇండిగో ఎయిర్‌లైన్ 2023-24లో మొత్తం 10.67 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇది వార్షిక ప్రాతిపదికన 24.7 శాతం వృద్ధి. తద్వారా సంస్థ లాభాలు రూ. 8,157 కోట్లకు చేరుకుందని సంస్థ పేర్కొంది.

Advertisement

Next Story