Indigo: జనవరి 10 నుంచి ఢిల్లీ-బెంగళూరు విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు: ఇండిగో

by Maddikunta Saikiran |
Indigo: జనవరి 10 నుంచి ఢిల్లీ-బెంగళూరు విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు: ఇండిగో
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఢిల్లీ-బెంగళూరు(Delhi-Bangalore) మార్గంలోని విమానాల్లో బిజినెస్ క్లాస్(Business Class) సీట్లును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత డిమాండ్(Demand) బట్టి మార్చి వరకు ఢిల్లీ నుంచి బెంగళూరు మార్గంలో తిరిగే మొత్తం 15 విమానాల్లో ఈ సేవలను అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. కాగా ఇండిగో నవంబర్(November)లో ఢిల్లీ నుంచి ముంబై(Delhi-Mumbai) మార్గంలోని ఇండిగో స్ట్రెచ్(Indigo Stretch) పేరుతో తొలుత ఈ సేవలను ప్రారంభించింది. వాటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడంతో వచ్చే జనవరి నుంచి మొత్తం 20 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు లభిస్తాయని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇటీవలే ఓ నివేదిక ప్రపంచంలోని చెత్త ఎయిర్ లైన్స్(Worst Airlines) సంస్థగా ఇండిగోని అభివర్ణించిన విషయం తెలిసిందే. సమయపాలన, ఎయిర్‌లైన్స్‌లో నిర్వహణ లోపం, ఇతర ప్యారామీటర్స్ ఆధారంగా ఇండిగోకు బ్యాడ్ రేటింగ్ ఇచ్చింది. దీనిపై ఇండిగో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సర్వీసులపై వచ్చిన నివేదికను ఖండిస్తూ.. తాము సమయపాలనతో పాటు అన్ని రకాల సేవలను మెరుగుపరుస్తున్నామని సృష్టం చేసింది.

Advertisement

Next Story