- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగు నెలల గరిష్ఠానికి భారత నిరుద్యోగ రేటు!
న్యూఢిల్లీ: భారత నిరుద్యోగ రేటు నాలుగు నెలల గరిష్ఠానికి చేరిందని తాజా గణాంకాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కంటే ఎక్కువ మంది వర్క్‌ఫోర్స్‌లో చేరడంతో నిరుద్యోగ రేటు పెరిగిందని పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ(సీఎంఐఈ) డేటా వెల్లడించింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినన్ని ఉద్యోగాలను సృష్టించడం ప్రస్తుతం కీలక సవాలుగా మారింది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి నిరుద్యోగ రేటు 7.8 శాతం నుంచి ఏప్రిల్‌లో 8.11 శాతానికి పెరిగింది. ఇది డిసెంబర్ తర్వాత నమోదైన అత్యధికం. అదే నెలలో పట్టణ నిరుద్యోగం 8.51 శాతం నుంచి 9.81 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంత నిరుద్యోగం మాత్రం 7.47 శాతం నుంచి స్వల్పంగా 7.34 శాతానికి దిగొచ్చిందని సీఎంఐఈ హెడ్ మహేష్ వ్యాస్ చెప్పారు.
సమీక్షించిన నెలలో దేశంలో మొత్తం శ్రామిక శక్తి 2.55 కోట్లు పెరిగి 46.76 కోట్లకు చేరుకుంది. గ్రామీణ శ్రామిక శక్తిలో దాదాపు 94.6 శాతం మంది ఉపాధి పొందారు. అయితే పట్టణ ప్రాంతాల్లో 54.8 శాతం మంది మాత్రమే కొత్త ఉద్యోగాలను పొందగలిగారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉపాధి హామీ కార్యక్రమానికి డిమాండ్ తగ్గుతోందని సీఎంఐఈ అభిప్రాయపడింది.