రూ. వెయ్యి కోట్లు దాటిన భారత బొమ్మల ఎగుమతులు!

by Vinod kumar |
రూ. వెయ్యి కోట్లు దాటిన భారత బొమ్మల ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో భారత బొమ్మల ఎగుమతులు రూ. 1,017 కోట్లకు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పరిశ్రమ రూ. 2,601 కోట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడ్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ బొమ్మల పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని, సమీక్షించిన కాలంలో నమోదైన ఎగుమతులు 2013 నాటితో పోలిస్తే 6 రెట్లు పెరిగినట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ హోయల్ ఓ ప్రకటనలో తెలిపారు.

2013-14 ఏప్రిల్-డిసెంబర్ మధ్య బొమ్మల ఎగుమతులు కేవలం రూ. 167 కోట్లు మాత్రమే జరిగాయి. భారత్ నుంచి బొమ్మల తయారీతో పాటు ఎగూతులను ప్రోట్సహించేందుకు ప్రభుత్వం నాణ్యత లేని చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను తగ్గించే చర్యలు తీసుకుంటోంది. 2018-19లో భారత్ రూ. 2,960 కోట్ల విలువైన బొమ్మలను దిగుమతి చేసుకోగా, 2021-22 నాటికి ఇది 70 శాతం తగ్గి రూ. 870 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రభుత్వం 2020లో బొమ్మల దిగుమతులను తగ్గించే లక్ష్యంతో దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 60 శాతానికి, ఈ ఏడాదిలో 70 శాతానికి పెంచారు. ముఖ్యంగా స్థానికంగా బొమ్మల తయారీని పెంచేందుకు కేంద్రం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని కూడా అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed