- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఊహించిన దానికంటే వేగంగా దూసుకెళ్తున్న జీడీపీ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి ఊహించిన దానికంటే అత్యధికంగా దూసుకెళ్తోంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రెండు రెట్లు పెరగడం విశేషం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.4 శాతానికి చేరుకుందని గురువారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) వెల్లడించింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 4.3 శాతం కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అంచనా వేసిన 6.5 శాతం కంటే అధికం. ఇదే సమయంలో మొదటి, రెండో త్రైమాసికలకు సంబంధించిన గణాంకాలను కూడా ఎన్ఎస్ఓ సవరించింది. ఇంతకుముందు మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండగా 8.2 శాతానికి సవరించింది. అలాగే రెండో త్రైమాసికానికి వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 8.1 శాతానికి పెంచింది.
2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా ఎన్ఎస్ఓ వృద్ధి అంచనాను 7 శాతం నుండి 7.6 శాతానికి సవరించింది. తయారీ రంగం నెమ్మదించడం, బలహీనమైన వినియోగం కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి మందగిస్తుందని పలువురు ఆర్థికవేత్తలు రాయిటర్స్ పోల్‌లో భావించారు. అయితే, అందుకు భిన్నంగా వృద్ధి రేటు పుంజుకోవడం గమనార్హం. సమీక్షించిన కాలంలో తయారీ రంగం 11.6 శాతం, నిర్మాణ రంగం 10.7 శాతం, వ్యవసాయ రంగం 3.8 శాతం వృద్ధి చెందాయి. మైనింగ్ రంగ వృద్ధి 7.5 శాతం, విద్యుత్, ఇతర యుటిలిటీల వృద్ధి 9 శాతంతో జీడీపీ పెరుగుదలకు దోహదపడ్డాయి. ప్రధాన రంగాల్లో వృద్ధి పెరగడమే జీడీపీ పుంజుకునేందుకు ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది.
15 నెలల కనిష్టానికి కీలక రంగాల..
మరోవైపు, భారత ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన జనవరి నెలకు సంబంధించి 15 నెలల కనిష్టంతో 3.6 శాతంగా నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అంతకుముందు డిసెంబర్‌లో ఇది 4.9 శాతం పెరిగింది. ప్రధానంగా బొగ్గు, ఉక్కు, సిమెంట్, సహజ వాయువు, విద్యుత్, ముడి చమురు రంగాల్లో ఉత్పత్తి సానుకూలంగా నమోదైంది.