Exports: డిసెంబర్‌లో స్వల్పంగా తగ్గిన ఎగుమతులు

by S Gopi |
Exports: డిసెంబర్‌లో స్వల్పంగా తగ్గిన ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్ నెలలో భారత ఎగుమతులు స్వల్పంగా క్షీణించాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఎగుమతులు నెమ్మదించాయని, గత నెలలో సరుకుల ఎగుమతులు 1 శాతం తగ్గి 38.01 బిలియన్ డాలర్ల(రూ. 3.28 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 4.9 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్ల(రూ. 5.18 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. గత నెలలో అంతర్జాతీయంగా అమెరికా వాణిజ్య విధానంపై నెలకొన్న ఆందోళనలు, అనేక దేశాల్లో అంతర్గతంగా నెలకొన్న పారిశ్రామిక విధానాలు, వాణిజ్య సవాళ్ల ముప్పు వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రతికూలంగా ప్రభావం చూపాయని గణాంకాలు వెల్లడించాయి. ఈ పరిణామాల ప్రభావం 2025లోనూ కొనసాగవచ్చని, ఎగుమతులపై కొంత ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అలాగే, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్లోబల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు, వ్యాపార కార్యకలాపాలు వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed