Infosys: ప్రజలు జనాభా నియంత్రణంపై దృష్టి సారించలేదు: ఇన్ఫో నారాయణ మూర్తి

by S Gopi |
Infosys: ప్రజలు జనాభా నియంత్రణంపై దృష్టి సారించలేదు: ఇన్ఫో నారాయణ మూర్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో జనాభా పెరుగుదల కీలక సవాలుగా మారిందని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి నుంచి భారతీయులు జనాభా నియంత్రణపై శ్రద్ధ చూపలేదని, ఇది దేశానికి అతిపెద్ద సవాలుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నారాయణ మూర్తి ప్రసంగించారు. 'ప్రస్తుతం భారత్.. జనాభాతో పాటు తలసరి భూమి లభ్యత, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల విషయంలో ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎమర్జెన్సీ కాలం నుంచి మనమెవరం జనాభా నియంత్రణపై తగినంత శ్రద్ధ చూపలేదు. దీనివల్ల భారత్ అస్థిరంగా మారవచ్చు. అమెరికా, బ్రెజిల్, చైనా లాంటి దేశాల తలసరి భూమి లభ్యత చాలా ఎక్కువగా ఉందని' ఆయన వివరించారు. దేశ ప్రగతికి దోహదపడటం నిజమైన వృత్తినిపుణుడి బాధ్యత అని నారయణ మూర్తి తెలిపారు. ఇది ఉన్నతమైన ఆకాంక్షలు, కలలను సాకారం చేసే కృషిపైన ఆధారపడి ఉంటుందన్నారు. ఒక తరం బాగుండాలంటే ఎన్నో త్యాగాలు చేయాలని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed