- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరిగి వొడాఫోన్ ఐడియాలోకి కుమార్ మంగళం బిర్లా.. కంపెనీ దశ తిరిగేనా!?
ముంబై: టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్ హోదాలో రెండేళ్ల క్రితం తప్పుకున్న బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా సంస్థ బోర్డులోకి తిరిగి వచ్చారు. అదనపు డైరెక్టర్‌గా బోర్డులో చేరినట్టు, ఆయన బాధ్యతలు గురువారం(ఏప్రిల్ 20) నుంచే అమల్లోకి రానున్నట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో కృష్ణ కిషోర్ మహేశ్వరి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం కుమార్ మంగళం బిర్లా నియామకం జరిగింది.
వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం భారీ అప్పుల్లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కంపెనీ సుమారు రూ. 2.23 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉంది. 2021లో ప్రభుత్వం అప్పుల్లో ఉన్న టెలికాం కంపెనీల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది. అందులో భాగంగా ప్రభుత్వానికి బకాయిపడిన మొత్తాన్ని ఈక్విటీ రూపంలో మార్చేందుకు వీలు కల్పించింది. ఆ నిర్ణయంతో కంపెనీకి కొంతమేర ఊరట లభించింది.
Also Read....
రూ.1000 లోపు Amazon Prime, Disney+ Hotstarలను అందించే Airtel పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు