Nitin Gadkari: 2030 నాటికి రూ .20 లక్షల కోట్లకు భారత ఈవీ మార్కెట్: నితిన్ గడ్కరీ

by S Gopi |
Nitin Gadkari: 2030 నాటికి రూ .20 లక్షల కోట్లకు భారత ఈవీ మార్కెట్: నితిన్ గడ్కరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇదే స్థాయిలో కొనసాగితే 2030 నాటికి దేశ ఈవీ మార్కెట్ విలువ రూ. 20 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, అదే సమయానికి ఏటా కోటి ఈవీ వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేశారు. మంగళవారం జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) వార్షిక సదస్సులో మాట్లాడిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ.. 2030 నాటికి ఈవీ ఫైనాన్సింగ్ మార్కెట్ రూ. 4 లక్షల కోట్లకు చేరవచ్చు. అలాగే, భారత ఆటోమొబైల్ రంగం 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం ఉంది. ప్రసుత్తం దేశంలో 30 లక్షల ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. మొత్తం అమ్మకాల్లో 56 శాతం టూ-వీలర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఈవీ విక్రయాలు 45 శాతం పెరిగాయని గడ్కరీ చెప్పారు. ఇదే సమావేశంలో పాత వాహనాల స్క్రాపేజ్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు స్క్రాపేజ్ చేసే వాహనాలకు బదులు కొత్త వాటిపై 3 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. మరిన్ని ప్రయోజనాలతో పరిశ్రమ స్క్రాపేజ్ విధానాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో మరో రెండేళ్లలో ఈవీ ధరలు పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా మారుతుందని గడ్కరీ ప్రస్తావించారు.

Advertisement

Next Story