రూ. 13 లక్షల కోట్లకు దేశీయ ఈ-కామర్స్ పరిశ్రమ!

by Harish |
రూ. 13 లక్షల కోట్లకు దేశీయ ఈ-కామర్స్ పరిశ్రమ!
X

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ సాధారణ కొనుగోలు ధోరణిగా మారిన నేపథ్యంలో భారత ఈ-కామర్స్ పరిశ్రమ 27 శాతం వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని ఓ నివేదిక తెలిపింది. 2026 నాటికి ఈ-కామర్స్ రంగం సుమారు రూ. 13.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని రెడ్‌సీర్ నివేదిక అంచనా వేసింది. ఇది మొత్తం రిటైల్ మార్కెట్ కంటే దాదాపు మూడు రెట్లు కావడం గమనార్హం.

2022 నాటికి ఈ-కామర్స్ మార్కెట్ విలువ రూ. 5.17 లక్షల కోట్లుగా ఉంది. 2026 నాటికి కిరాణా, ఆన్‌లైన్ విక్రయాలు మొత్తం పరిశ్రమ అమ్మకాల్లో 25 శాతానికి పైగా వాటాను కలిగి ఉంటుందని, ఇది భవిష్యత్తులో డిజిటల్ వృద్ధికి ఉన్న ప్రాధాన్యతను సూచిస్తుందని రెడ్‌సీర్ అభిప్రాయపడింది.

ఇక, గత ఏడాది భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఎలక్ట్రానిక్స్, సంబంధిత ఉత్పత్తులు, ఫ్హ్యాషన్, హోమ్‌కేర్, కిరాణా, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో గణనీయమైన అమ్మకాలు జరిగాయి. ఎలాక్ట్రానిక్స్ విభాగంలో బోట్, బీబీకె, ఆసుస్ బ్రాండ్లు మొదటి మూడు స్థానాల్లో ఉండగా, ఫ్యాషన్ అండ్ హోమ్ విభాగంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ప్యూమా ఇండియా, వేక్‌ఫిట్ కంపెనీలు, కిరాణా-వ్యక్తిగత సంరక్షణ విభాగంలో హిందూస్తాన్ యూనిలీవర్, లోరియల్ ఇండియా, లీసియస్ బ్రాండ్లు నిలిచాయని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story