- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్దాల కనిష్టానికి భారతీయ బ్యాంకుల మొండి బకాయిలు!
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం కంటే తక్కువగా ఉండనున్నాయని అసోచామ్-క్రిసిల్ రేటింగ్ సంయుక్త నివేదిక గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో 2024, మార్చి ఆఖరు నాటికి బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) దశాబ్దాల కనిష్ట స్థాయి 4 శాతానికి చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక పునరుద్ధరణతో పాటు రుణాల వృద్ధి కూడా గణనీయంగా పెరగడం ఎన్‌పీఏల క్షీణతకు కారణమని వెల్లడించింది.
భారతీయ బ్యాంకుల మొండి బకాయిలు 2018, మార్చి 31 సమయంలో గరిష్ట స్థాయి 16 శాతం నుంచి భారీగా తగ్గనున్నాయి. గత కొన్నేళ్లలో బ్యాంకుల రుణాల రికవరీ మెరుగ్గా ఉండటంతో పాటు మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్ కారణంగా ఎన్‌పీఏలు దిగొచ్చాయని అసోచామ్ సెక్రటరీ దీపక్ సూద్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భారత బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.