- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
21 నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు!
న్యూఢిల్లీ: ఆసియా ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, చమురు డిమాండ్ నెమ్మదించిన కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత సరుకులు, సేవల వాణిజ్య లోటు 21 నెలల కనిష్ఠానికి తగ్గింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సరుకులు, సేవల వాణిజ్య లోటు 8.37 బిలియన్ డాలర్ల(రూ. 68.9 వేల కోట్ల) నుంచి 1.38 బిలియన్ డాలర్ల(రూ. 11.35 వేల కోట్ల)కు పడిపోయింది.
ఇక, గత నెలలో భారత ఎగుమతులు(వస్తువులు, సేవలు కలిపి) 12.7 శాతం తగ్గి రూ. 2.85 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే, దిగుమతులు గతేడాది ఇదే నెలలో నమోదైన రూ. 4.78 లక్షల కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ. 4.10 లక్షల కోట్లకు తగ్గాయని గణాంకాలు తెలిపాయి.
సమీక్షించిన నెలలో ఆయిల్ మీల్స్ (95.14 శాతం), ఎలక్ట్రానిక్ వస్తువులు (26.49 శాతం), సిరామిక్ ఉత్పత్తులు, గాజుసామాను (17.21 శాతం), సుగంధ ద్రవ్యాలు (14.44 శాతం), పండ్లు, కూరగాయలు (9.96 శాతం), కాఫీ (4.17 శాతం) తృణధాన్యాలు & ఇతర ప్రాసెస్ చేయబడిన వస్తువులు (2.03 శాతం) పెరిగాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు ఏప్రిల్‌లో 26.49 శాతం పెరిగి రూ. 17.36 వేల కోట్లకు చేరుకున్నాయి. మాంద్యం ప్రభావం కారణంగా డిమాండ్ తగ్గి టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్ ఎగుమతులు క్షీణించాయి.
Also Read..