- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2032 నాటికి అతిపెద్ద ఆర్థిక సూపర్‌పవర్‌గా భారత్
న్యూఢిల్లీ: ప్రస్తుత శతాబ్దం చివరి నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక సూపర్‌పవర్‌గా అవతరించనుందని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్(సీఎబీఆర్) తన తాజా నివేదికలో పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ లీగ్ టేబుల్ రిపోర్ట్ ప్రకారం, నిర్దేశించిన కాలానికి భారత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) చైనా కంటే 90 శాతం, అమెరికా కంటే 30 శాతం పెద్దదిగా ఉండనుంది. అలాగే, 2024 నుంచి 2028 మధ్య భారత్ సగటున 6.5 శాతంతో బలమైన వృద్ధిని కొనసాగిస్తుంది. 2032 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుంది. జనాభా, ఇతర వృద్ధి అంచనాలను బట్టి, పెరుగుతున్న మధ్యతరగతి, చురుకైన వ్యాపారవేత్తల వృద్ధి, ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారంగా 2080 నాటికి చైనా, అమెరికా రెండింటినీ భారత్ అధిగమిస్తుందని నివేదిక అభిప్రాయపడింది.
అయితే, భారత్ ముందు పేదరికం, అసమానత, శ్రామిక శక్తి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యావరణ వంటి కీలక సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమించాల్సిన బాధ్యత కూడా ఉందని నివేదిక వివరించింది. వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, పౌర సమాజం, అంతర్జాతీయ సమాజంతో సహకారం ఎంతో కీలకమని నివేదిక వెల్లడించింది.