భారత్ నుంచి యూఏఈ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్లు!

by Harish |
భారత్ నుంచి యూఏఈ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్లు!
X

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత్-యూఏఈ మధ్య వాణిజ్యం మరింత బలోపేతమవుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూఏఈకి భారత ఎగుమతులు 2026-27 కల్లా 31.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 2.56 లక్షల కోట్ల) నుంచి 50 బిలియన్ డాలర్ల(రూ. 4.08 లక్షల కోట్ల)కు చేరుకుంటాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ చెప్పారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఇది సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.

గతేడాది మే 1న వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, యూఏఈల మధ్య వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందిందని సునీల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి యూఏఈకి ఎగుమతులు 11.8 శాతం పెరిగి రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే, దిగుమతులు 18.8 శాతం వృద్ధి చెంది రూ. 4.35 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022లో అమలైన భారత్-యూఏఈ మధ్య వాణిజ్య ఒప్పందం ఈ వృద్ధిని అత్యంత ప్రభావితం చేసిందని కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ మాజీ ఛైర్మన్ పి అఖీల్ అహ్మద్ వెల్లడించారు.

Advertisement

Next Story