- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11.4 శాతం పెరిగిన భారత కంపెనీల ఆదాయం!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి భారతీయ కంపెనీల ఆదాయం 11.4 శాతం పెరిగిందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దేశవ్యాప్తంగా 579 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, డిమాండ్ పుంజుకోవడం, అన్ని రంగాల్లోని కంపెనీలు ధరలు పెంచడంతో ఆదాయం పెరిగింది. అయితే, త్రైమాసిక పరంగా చూస్తే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే చివరి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి 5.2 శాతం తగ్గింది.
ముఖ్యంగా విమానయానం, హోటళ్లు, ఓడరేవులు, రత్నాభరణాల రంగాల్లో ఆదాయం పుంజుకుందని నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ ఖర్చులు పెరగడం, ఫారెక్ట్ రేట్ల కారణంగా కంపెనీల మార్జిన్ స్వల్పంగా 1.26 శాతం తగ్గిందని ఇక్రా కార్పొరేట్ విభాగం వైస్-ప్రెసిడెంట్ కింజల్ షా అన్నారు.
అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలగా కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీల మార్జిన్‌లపై ఒత్తిడి కనిపిస్తోంది. మెటల్, సిమెంట్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి కొన్ని రంగాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది. వివిధ రంగాల్లో సాధారణ ధరల పెరుగుదల, ఇన్‌పుట్ ఖర్చులు స్థిరంగా ఉండటం, సెమీకండక్టర్ల కొరత తగ్గి సరఫరా మెరుగ్గా ఉన్న కారణంగా రానున్న త్రైమాసికాల్లో కంపెనీల మార్జిన్ రికవరీకి అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.
Also Read..