రూ.13.73 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by Harish |   ( Updated:2023-03-11 08:35:42.0  )
రూ.13.73 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

న్యూఢిల్లీ: భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 17 శాతం మేరకు పెరిగాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10 , 2023 మధ్య కాలంలో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యంలో 83 శాతానికి సమానం. సమీక్ష కాలంలో మొత్తం స్థూల వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ. 16.68 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే ఇందులో రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్‌లు ఉన్నాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన రీఫండ్‌ల కంటే 59.44 శాతం ఎక్కువ. రీఫండ్‌లు పోగా, ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 13.73 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఈ మొత్తం బడ్జెట్ అంచనాలలో 96.67 శాతానికి సమానం కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలలో 83.19 శాతం అని సీబీటీడీ పేర్కొంది. రీఫండ్‌ల సర్దుబాటు తర్వాత, కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్‌తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో 20.06 శాతంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed