- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ నాటికి మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ విడుదల
దిశ, బిజినెస్ బ్యూరో: మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ డిసెంబర్ నాటికి తీసుకొస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తక్కువ సమయంలోనే పటిష్టమైన సెమీకండక్టర్ పరిశ్రమను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడికి చెందుతుందన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన, 2022 జనవరిలో ప్రధాని మోడీ సెమీకండక్టర్ పాలసీని ప్రారంభించారు. పర్యావరణంపై దృష్టి సారించి తక్కువ సమయంలోనే సెమీకండక్టర్ పరిశ్రమను అభివృద్ధి చేయడంపై ఈ సదస్సులోని సీనియర్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారన్నారు. ఈ విషయంలో వారంతా భారత నిర్ణయాలను ప్రశంసించారన్నారు. తయారీ రంగంలోని చాలామంది సీఈఓలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు, సెమీకండక్టర్ బిజినెస్ హెడ్‌లు దావోస్‌లో ఈ అంశాలను విశ్వసిస్తున్నారు. భారత్ చాలా బలమైన సెమీకండక్టర్ పరిశ్రమను అభివృద్ధి చేసిందని చెబుతున్నారని మంత్రి తెలిపారు. కాగా, గతేడాది జూన్‌లో అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ భారత్‌లో మేడ్ ఇన్ ఇండియా చిప్ తయారీకి ఒప్పందం చేసుకుంది. 2024, డిసెంబర్ నాటికి చిప్‌ను విడుదల చేస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.