- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో లుపిన్ డయాగ్నోస్టిక్స్ రెఫరెన్స్ లాబొరేటరీ ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఫార్మా రంగంలో అగ్రగామి సంస్ధ లుపిన్ లిమిటెడ్ (లుపిన్) నేడు తమ నూతన ప్రాంతీయ రెఫరెన్స్ లాబొరేటరీని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. లుపిన్ డయాగ్నోస్టిక్స్ నెట్‌వర్క్ విస్తరణ, దక్షిణ భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలనే కంపెనీ వ్యూహాలలో భాగం. ఈ రీజనల్ రెఫరెన్స్ లాబొరేటరీ, లుపిన్ డయాగ్నోస్టిక్స్ యొక్క ప్రస్తుత నెట్‌వర్క్ భారతదేశవ్యాప్తంగా 380కు పైగా లుపి మిత్రా (లుపిన్ యొక్క ఫ్రాంచైజీ కలెక్షన్ కేంద్రాలు), 23 లాబొరేటరీలకు జోడించబడుతుంది.
నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటుగా అందుబాటు ధరలలో ఉంచడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్ కట్టుబడింది. ఈ లాబొరేటరీ ప్రారంభంతో, లుపిన్ డయాగ్నోస్టిక్స్ అత్యధిక నాణ్యత కలిగిన, ఆధారపడతగిన డయాగ్నోస్టిక్ సేవలను హైదరాబాద్‌తో పాటుగా చుట్టుపక్కల నగరాల వినియోగదారులకు అందించనుంది.
సాధారణ, ప్రత్యేక పరీక్షలతో పాటుగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ లో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, సైటోజెనిటిక్స్, ఫ్లో సైటోమెట్రి, సైటాలజీ, మైక్రోబయాలజీ, సెరాలజీ, హెమటాలజీ, ఇమ్యునాలజీ, రొటీన్ బయోకెమిస్ట్రీ, మరెన్నో పరీక్షలు చేస్తారు. లుపిన్ డయాగ్నోస్టిక్స్ వద్ద అర్హత కలిగిన క్లీనికల్ నిపుణులు అత్యాధునిక ఆటోమేషన్ పై ఆధారపడతారు. అత్యంత కచ్చితత్వంతో కూడిన పరీక్షా ఫలితాలను అందించేందుకు క్రమబద్దీకరించబడిన ప్రక్రియలను అనుసరిస్తారు. ఈ కారణం చేత రోగులు తమ ఆరోగ్యం గురించి పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోగలరు.
‘‘భారతదేశవ్యాప్తంగా వ్యక్తులతో పాటుగా కుటుంబాలకు సైతం అందుబాటు ధరలలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే మా లక్ష్యాన్ని కొనసాగిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని లుపిన్ డయాగ్నోస్టిక్స్ సీఈఓ రవీంద్రకుమార్ అన్నారు.
‘‘వ్యాధి నిర్ధారణ పరీక్షలు డాక్టర్లు, రోగులు పూర్తి సమాచారంతో నిర్ణయాలను తీసుకోవడంలో అత్యంత కీలకంగా నిలుస్తాయి. వ్యాధి నిర్వహణ, సరైన చికిత్స విధానాన్ని గుర్తించే దిశగా మొదటి అడుగుగా ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిలుస్తాయి. మా వ్యక్తిగతీకరించిన, ఇంటరాక్టివ్ స్మార్ట్ నివేదికలు డాక్టర్లు, రోగులు ఆరోగ్య లక్షణాలలో గత ధోరణులు విశ్లేషించేందుకు తోడ్పడటంతో పాటుగా నిర్ధారణ ఆధారితంగా చికిత్సలకు మార్గనిర్దేశనం చేసేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని ఆయన జోడించారు.
లుపిన్ డయాగ్నోస్టిక్స్ ఓ సమగ్రమైన శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను డాక్టర్లు, రోగులు, వినియోగదారులకు అందిస్తుంది. ఈ కంపెనీ పలు వినియోగదారుల లక్ష్యిత ఫీచర్లు అయిన లైవ్ హోమ్ కలెక్షన్ బుకింగ్, ట్రాకింగ్, జీపీఎస్ ఆధారిత ఉష్ణోగ్రత నియంత్రిత శాంపిల్ మూవ్‌మెంట్, ఉచిత హోమ్ కలెక్షన్, ప్రతి లేబరేటరీకి ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్, స్మార్ట్ నివేదికలు, ట్రెండ్ నివేదిక విశ్లేషణలు వంటివి అందిస్తుంది.
ఈ కంపెనీ తమ ప్రయాణాన్ని అత్యాధునిక 45వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నేషనల్ రెఫరెన్స్ లాబొరేటరీని నవీ ముంబైలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రారంభించింది. ఇక్కడ ప్రపంచశ్రేణి పరికరాలు, సుశిక్షితులైన టెక్నాలజిస్ట్‌లు, అనుభవజ్ఞులైన డాక్టర్లు, అత్యంత కఠినమైన నాణ్యత మార్గదర్శకాలను సైతం అనుసరిస్తున్నారు.