- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్చిలో కూడా కొనసాగిన లేఆఫ్‌లు
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ప్రారంభం నుంచి కొనుసాగుతున్న లేఆఫ్‌ల ప్రక్రియ మార్చి నెలలో కూడా కనిపించింది. ఖర్చులను తగ్గించుకోడానికి కృత్రిమ మేధ ఆధారిత ఆటోమెషన్‌కు మారడానికి చిన్న కంపెనీలతో పాటు, పెద్ద టెక్ సంస్థలు సైతం భారీగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ప్రధాన సవాళ్లతో పోరాడుతుంది. కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితుల మధ్య యాపిల్, డెల్, గూగుల్, ఎరిక్సన్ వంటి దిగ్గజ కంపెనీలు లేఆఫ్‌ను చేపడుతున్నాయి. ఈ కంపెనీలన్ని కూడా వేరు వేరు కారణాలను పేర్కొంటూ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి.
పని సరిగ్గా చేయని కారణంగా ఇంజనీర్ల బృందాన్ని తొలగించినట్లు యాపిల్ గతంలో పేర్కొనగా, 5G నెట్‌వర్క్ పరికరాల డిమాండ్ మందగించడం వలన స్వీడన్‌లో 1,200 ఉద్యోగాలను తొలగిస్తామని ఎరిక్సన్ తెలిపింది. డెల్ కంపెనీ కూడా వ్యయ-తగ్గింపు చర్యలో భాగంగా దాదాపు 6000 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. 2024 ప్రారంభం నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు 56,858 టెక్ ఉద్యోగాలు తొలగించారని Layoffs.fyi నివేదించింది. కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువగా ఉద్యోగ నియామకాలను చేసిన కంపెనీలు ఆ తర్వాత తొలగింపులు చేపడుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ లేఆఫ్ ప్రక్రియ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా AI కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఆశించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.