- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
LIC నుంచి అదిరిపోయే పాలసీ.. రూ. 22 లక్షలు మీ సొంతం
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్నో పాలసీలను అందిస్తూ, వినియోగదారులకు అత్యంత నమ్మకంగా ఉన్న బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది. దాని పేరు 'ధన్ సంచయ్'. నాలుగు రకాల పెట్టుబడుల ఆప్షన్‌లతో ఉన్న ఈ పాలసీని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్‌ఐసీ గత ఏడాది తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ పాలసీలో లోన్ అందించడంతో పాటు గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ఉంటుంది. పాలసీదారు మధ్యలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. పాలసీ 5 నుండి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్ల పాటు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారు. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్. నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్స్ ఉంటాయి. A, B ఎంపికలలో, హామీ మొత్తం కనీసం రూ. 3,30,000, ఆప్షన్ C లో రూ. 2,50,000, D లో రూ. 22,00,000.
ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 3 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి A, Bలకు 50 సంవత్సరాలు, Cకి 65 సంవత్సరాలు, D పరిమితి 40 సంవత్సరాలు. ఈ పాలసీకి కనీస ప్రీమియం సంవత్సరానికి రూ. 30,000. పెట్టుబడిదారులు 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కింద మినిమం సమ్ అష్యూర్డ్ రూ. 2.5 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంటుంది. ఈ పాలసీ గురించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని LIC బ్రాంచ్‌లో లేదా ఏజెంట్‌ను సంప్రదించగలరు.