- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా..? అయితే ఈ విధంగా ఈజీగా లోన్ పొందండి..!
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో లోన్‌లు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే బ్యాంకులు లేదా వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్‌లు(రుణాలు) పొందాలంటే తప్పనిసరిగా మంచి సిబిల్ స్కోర్ ఉండాల్సిందే. లోన్‌లు ఇచ్చే సంస్థలు దరఖాస్తుదారుని సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలను మంజూరు చేస్తాయి. ముఖ్యంగా హోమ్ లోన్, కార్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ ఇలా అన్ని రకాల రుణాలకు క్రెడిట్ స్కోర్ తప్పనిసరి.
సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. మార్కెట్ నిపుణుల ప్రకారం, క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లకు పైగా ఉంటే మంచి స్కోర్‌గా పేర్కొంటారు. రుణాలు తీసుకున్న వారు క్రమంగా తన రుణాలు తిరిగి చెల్లించినట్లయితే వారి క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఒకవేళ సమయానికి రుణాలు తిరిగి చెల్లించలేకపోతే స్కోర్ తగ్గి కొత్త రుణాలు పొందడం కష్టం అవుతుంది.
ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరికి వారి ఆదాయ స్థితి, చెల్లింపులను బట్టి ఎంతో కొంత క్రెడిట్ స్కోర్ ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే గనక బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వెంటనే రుణాలు మంజూరు చేస్తాయి. ఒకవేళ తక్కువ ఉంటే గనక రుణాలు పొందడం కష్టం అవుతుంది. ఇలాంటి వారు వేరే పద్దతుల ద్వారా రుణాలు తీసుకునే ఆప్షన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి గోల్డ్ లోన్, భూమి/ఇల్లు తాకట్టు పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలగునవి ఆప్షన్స్‌గా ఉన్నాయి.
గోల్డ్ లోన్: ప్రస్తుత కాలంలో అత్యంత విలువైనది అంటే బంగారం మాత్రమే. రోజు రోజుకు దీని ధర భారీగా పెరుగుతుంది. అలాంటప్పుడు, బంగారాన్ని తనకా పెట్టి కావాల్సిన రుణాన్ని పొందవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, వివిధ ఫైనాన్స్ సంస్థలు గోల్డ్ లోన్ జారీ చేస్తాయి. ముఖ్యంగా ఈ రుణాలను ఇవ్వడానికి సిబిల్ స్కోర్ అవసరం లేదు. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సరైన సమయానికి రుణాలు తిరిగి చెల్లించలేకపోతే తనఖా పెట్టిన బంగారం జప్తు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి గోల్డ్ తనఖా పెట్టి రుణాలను తీసుకున్న వారు సరైన సమయానికి రుణాలు తిరిగి చెల్లించాలి.
భూమి/ఇల్లు తనఖా పెట్టడం: దరఖాస్తు దారుని పేరు మీద ఇల్లు గాని భూమి గాని ఉన్నట్లయితే వాటిని తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చు. ఈ విధంగా రుణాలు పొందడానికి సిబిల్ స్కోర్ అవసరం లేదు. అయితే దీనిలో బ్యాంకులు మాత్రమే ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తాయి. ఒకవేళ సరైన సమయానికి తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోతే తాకట్టు పెట్టిన ఆస్తిని జప్తు చేస్తారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు: వినియోగదారులు ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ కలిగి ఉన్నట్లయితే దానిని చూపించి కూడా రుణాలు పొందవచ్చు. మీకు ఉన్న డిపాజిట్ల ఆధారంగా సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయి. మీరు ఏ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ కలిగి ఉన్నారో అదే బ్యాంకులో ఈ విధంగా సులభంగా రుణాలు పొందవచ్చు.