IDBI నికర లాభంలో 64 శాతం వృద్ధి

by Harish |   ( Updated:2023-04-29 09:47:18.0  )
IDBI నికర లాభంలో 64 శాతం వృద్ధి
X

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ IDBI శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో దాని స్టాండ్‌లోన్ నికర లాభం 64.1 శాతం పెరిగి రూ.1,133 కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.691 కోట్లుగా ఉంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 35.3 శాతం పెరిగి రూ. 3,279.6 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,420.5 కోట్లుగా ఉంది. కేటాయింపులు ఈ త్రైమాసికానికి 26 శాతం, సంవత్సరానికి 47 శాతం పెరిగి రూ. 983.63 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. NPA (నిరర్ధక ఆస్తులు) డిసెంబర్ త్రైమాసికంలో 13.82 శాతం నుంచి 6.38 శాతానికి పడిపోయింది. నికర ఎన్‌పీఏ త్రైమాసికం క్రితం 1.08 శాతం నుంచి 0.92 శాతానికి పడిపోయింది. బ్యాంక్ మూలధన నిష్పత్తి సంవత్సరానికి 19.06 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 20.14 శాతం నుంచి 20.44 శాతానికి మెరుగుపడింది.

Advertisement

Next Story

Most Viewed