UPI చెల్లింపుల్లోనూ EMI సౌకర్యం తీసుకొచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్!

by Harish |
UPI చెల్లింపుల్లోనూ EMI సౌకర్యం తీసుకొచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చేసే యూపీఐ చెల్లింపుల కోసం నెలవారీ వాయిదా(ఈఎంఐ) సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ సౌకర్యం ద్వారా యూపీఐ విధానంలో వినియోగదారులు ఏదైనా వస్తువును కొంటే, అందుకైన మొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. బ్యాంకు అందిస్తున్న ఈ అవకాశం పే లేటర్ వినియోగదారులకు వర్తిస్తుంది.

సరసమైన చెల్లింపుల ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనేందుకు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చామని, కస్టమర్లు స్టోర్లలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఈఎంఐ ఎంచుకోవచ్చు. నెలవారి చెల్లింపు ఆఫర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ దుస్తుల వంటి విభాగాలకు వర్తిస్తుందని, ఆన్‌లైన్ చెల్లింపులకు కూడా ఈ సదుపాయం ఉంటుందని బ్యాంకు స్పష్టం చేసింది.

రూ. 10,000కు మించి ఎక్కువ మొత్తాలను ఈఎంఐ విధానంలో ఎంచుకోవచ్చు. గత కొన్నేళ్లలో ప్రజలు ఎక్కువగా యూపీఐ విధానంలోనే చెల్లింపులు చేస్తున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ అండ్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ అజిత్ భాస్కర్ వెల్లడించారు.

Advertisement

Next Story