Hyundai Motors IPO: హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ.. రెండో రోజు కూడా కనిపించని డిమాండ్

by Maddikunta Saikiran |
Hyundai Motors IPO: హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ.. రెండో రోజు కూడా కనిపించని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌(IPO Subscription) నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. భారతతీయ స్టాక్ మార్కెట్(Indian Stock Market) చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. సుమారు రూ.28,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి హ్యుందాయ్ అప్లై చేసుకుంది. ఇంతకముందు ఈ రికార్డు రూ.21,000 కోట్లతో ఎల్ఐసీ(LIC) పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డును హ్యుందాయ్ మోటార్స్ బ్రేక్ చేసింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద ఈక్విటీ షేర్లను ఆ సంస్థ విక్రయించనుంది. ఒక్కో షేరు ధరను రూ.1,865-1,960గా నిర్ణయించింది.

ఇదిలా ఉంటే..హ్యుందాయ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కు నిన్న మిశ్రమ స్పందన రాగా.. రెండో రోజు కూడా అంతగా డిమాండ్ కనిపించలేదు. బుధవారం వరకు 42 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. రూ.27,870 కోట్ల ఐపీఓలో భాగంగా 9.97 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.17 కోట్ల షేర్లు మాత్రమే సేల్ అయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు(Retail Investors) 38 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(Non Institutional Investors) 26 శాతం చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. కాగా హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ గడువు రేపటితో ముగియనుంది.

Advertisement

Next Story