Hyundai Motor IPO: వచ్చే వారమే హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ.. ఒక్కో షేర్ ధర ఎంతంటే ..?

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-08 17:13:53.0  )
Hyundai Motor IPO: వచ్చే వారమే హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ.. ఒక్కో షేర్ ధర ఎంతంటే ..?
X

దిశ, వెబ్‌డెస్క్:దక్షిణ కొరియా(South Korea) ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) ఇటీవల తాము ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)కు వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఓ షేర్ల ద్వారా దాదాపు రూ. 21 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ముందు హ్యుందాయ్ ధరఖాస్తు చేసుకోగా గత నెల అనుమతి లభించింది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఒక్కో షేర్ ధర రూ. 1,865-1,960 గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

కాగా భారతీయ స్టాక్ మార్కెట్లో(Indian Stock Market) చరిత్రలో ఇప్పటివరకు ఎల్ఐసీ(LIC) రూ. 21వేల కోట్లతో అతి పెద్ద ఐపీఓగా నిలిచింది.ఈ రికార్డును హ్యుందాయ్ ఐపీఓ వచ్చే వారం బ్రేక్ చేయనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద 14.2 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ సంస్థ.. 1996 సంవత్సరంలో మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభించగా.. ప్రస్తుతం 13 మోడల్స్ విక్రయిస్తోంది. ఇక దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత భారత మార్కెట్లోకి వస్తున్న తొలి వాహన కంపెనీ ఇదే. చివరిసారిగా 2003లో జపాన్(Japan) వాహన దిగ్గజం.. మారుతీ సుజుకీ(Maruti Suzuki) ఎక్స్చేంజీల్లో నమోదైంది.

Advertisement

Next Story