- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hyundai Creta EV: జనవరిలో లాంచ్ కానున్న హ్యుండాయ్ క్రెటా ఈవీ..!
దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాకు(South Korea) చెందిన ఆటో మొబైల్ దిగ్గజం హ్యుండాయ్(Hyundai) తన పాపులర్ మోడల్లలో ఒకటైన ఎస్‌యూవీ క్రెటా ఈవీ(Creta EV) విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 17న జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో ఈవెంట్లో ఈ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించనున్నారు. ఈ కారు ధరను కంపెనీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. క్రెటా ఈవీ 60 కిలోవాట్ల బ్యాటరీ(Battery) ప్యాక్ కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 500 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుంది. ఇక ఎక్స్ టీరియర్(Exterior) పరంగా చూస్తే క్లోజ్డ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, ఏరో ఇన్సర్ట్స్ వంటివి ఉన్నాయి. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25-అంగుళాల డిజిటల్ స్క్రీన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ కప్ హోల్డర్లు, కన్సోల్ డిజైన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-హోల్డ్ ఫంక్షన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలును మొబిలిటీ ఎక్స్‌పో ఈవెంట్లో ప్రకటించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.