- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > బిజినెస్ > Loan EMI: లోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు
Loan EMI: లోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: పర్సనల్ లోన్ (Personal Loan), హోం లోన్ (Home Loan), వెహికల్ లోన్ (Vehicle Loan), ఎడ్యుకేషన్ లోన్ (Education Loan).. ఇలా సమయానికి అవసరమైన లోన్ ను తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటాం. కొన్నినెలలు క్రమంగా లోన్ చెల్లించినా.. మధ్యలో వచ్చే ఇబ్బందుల కారణంగా.. లోన్ ఈఎంఐ (Loan EMI) కట్టలేకపోతుంటారు కొందరు. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్లు లోన్ ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే జైలుకు వెళ్తారని బెదిరిస్తుంటారు. వాటికి భయపడి కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే లోన్ ఈఎంఐ చెల్లించలేనంత మాత్రాన జైలుశిక్ష పడదంటోంది రిజర్వ్ బ్యాంక్ (RBI). ఏదేని కారణాల చేత లోన్ ఈఎంఐ చెల్లించలేని క్రమంలో.. సులువుగా లోన్ ను క్లియర్ చేసుకోవచ్చని తెలిపింది.
- తీసుకున్న లోన్లను సకాలంలో కట్టలేక ఇబ్బంది పడుతున్నవారికి ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. లోన్ ఈఎంఐ కట్టనంత మాత్రాన జైలుకు వెళ్లరని, అది క్రిమినల్ నేరం కాదని స్పష్టం చేసింది.
- కానీ.. లోన్ చెల్లింపులకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే మాత్రం.. చట్టపరమైన పరిణామాలకు దారితీయొచ్చని తెలిపింది.
- లోన్ సకాలంలో చెల్లించకపోతే దాని ప్రభావం క్రెడిట్ స్కోర్ పై పడుతుంది. భవిష్యత్ లో మళ్లీ బ్యాంక్ నుంచి లోన్లు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా అధిక వడ్డీ ఉంటుంది.
- ఈఎంఐలను సకాలంలో చెల్లించని నేపథ్యంలో బ్యాంకుని సంప్రదించకపోతే.. బ్యాంకులు ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని, వేలం వేసే అవకాశం ఉంది.
- లోన్ కట్టలేక ఇబ్బంది పడుతుంటే బ్యాంకుకి వెళ్లాలి. అందుకు పరిష్కారమేంటో తెలుసుకోవాలి.
- మీ లోన్ టెన్యూర్ ను పెంచడమో లేక.. వడ్డీని తగ్గించడమో చేస్తుంది. ఇవి రెండూ కాకుండా లోన్ ను పూర్తిగా చెల్లించేందుకు సమయం ఇస్తుంది. అప్పుడు లోన్ ను చెల్లించడం ఈజీ అవుతుంది.
- లోన్లను చెల్లించకపోవడం క్రిమినల్ నేరం కాదని ఆర్బీఐ రూల్స్ చెబుతున్నాయి. ఫైనాన్స్ కంపెనీలకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
Advertisement
Next Story