విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి Student Credit Cards.. ఇలా అప్లై చేసుకోండి..

by Javid Pasha |   ( Updated:2022-08-27 06:01:05.0  )
విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి Student Credit Cards.. ఇలా అప్లై చేసుకోండి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వినియోగించాడానికి మొగ్గు చూపుతున్నారు. క్రెడిట్ కార్డులతో అనేక ప్రయోజనాలను అందుకుంటున్న కారణంగా ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ బ్యాంకులు మాత్రం ఆదాయం ఉన్నవారికి మాత్రమే క్రెడిక్ కార్డులను ఇస్తున్నాయి. వాటిలో కొన్ని బ్యాంకులు మాత్రం విద్యార్థులకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. విద్యార్థులు తమ ఉండే ఆర్థిక అవసారలను తీర్చేందుకు, వారికి అనుగుణంగా బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డులను రూపొందించి, కాలేజీ విద్యార్థులకు ఇస్తున్నాయి.

అయితే ఈ క్రెడిట్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ కార్డుల వల్ల ఫలితాలేంటి, వీటికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి పత్రాలు అవసరం అన్న విషయాల్లో విద్యార్థులకు అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు మీకూ ఉంటే ఈ వార్త మీకోసమే..

అర్హులెవరు..

క్రెడిట్ కార్డు ఆదాయం ఉన్నవారికి మాత్రమే అయినా ఇవి స్టూడెంట్ కార్డులు కాబట్టి వీటికి ఆదాయం ముఖ్య అర్హత కాదు. విద్యార్థులకు ఆదాయం ఉండదు కాబట్టి స్టూడెంట్ క్రెడిట్ కార్డులకు బ్యాంకులు ఆదాయాన్ని ప్రధాన అర్హతల నుంచి మినహాయించాయి. అయితే ఈ కార్డులను దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థి ఖచ్చితంగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. దీంతో పాటుగా ఉన్న అర్హతలు బ్యాంకును బట్టి మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారతదేశంలో ఈ కార్డుల సంఖ్య పరిమితంగానే ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విద్యార్థులకు విద్యా రుణాల రూపంలో ఆర్థికంగా సహాయపడుతున్నాయి. వీటితో పాటుగా విద్యార్థులు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు సెక్యూర్ క్రెడిట్ కార్డులు, స్టూడెంట్ ఫారెక్స్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి.

స్టూడెంట్ క్రెడిట్ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్లు

1) పాన్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఫొటో ఉన్న గుర్తింపు కార్డు లేదా డాక్యుమెంట్

2) ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఆమోదం ఉన్న అడ్రెస్ ప్రూఫ్

3) డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్

4) కాలేజ్ ఐడీ కార్డు, కాలేజీలో చదువుతున్నట్లు యాజమాన్యం అందించే ఎన్‌రోల్‌మెంట్ పత్రం

5) పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు

దరఖాస్తు ఎలా చేసుకోవాలి

విద్యార్థి ఎంచుకునే క్రెడిట్ కార్డును బట్టి దరఖాస్తు విధానం ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నవారికి కార్డ్ ఇస్తుండగా, మరికొన్ని బ్యాంకులు విద్యారుణం ఉన్నవారికి క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి.

స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

1) స్టూడెంట్ క్రెడిట్ కార్డులు ఇచ్చే మొత్తం సాధారణ కార్డుల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ కార్డులపై విద్యార్థులు సగటున రూ.15 వేల పరిమితి ఉంటుంది. తద్వారా విద్యార్థులు తమ పరిమితికి మించకుండా నియంత్రించబడతారు.

2) ఈ కార్డుల కాల పరిమితి 5 సంవత్సరాలు

3) ఒకవేళ విద్యార్థులు తమ క్రెడిట్ కార్డును పోగొట్టుకుంటే వారికి నామమాత్రపు చార్జీలతో డూప్లికేట్ కార్డును బ్యాంకులు అందిస్తాయి.

4) వీటి దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కనీస పత్రాలు ఉంటే వీటిని పొందవచ్చు.

5) ఈ కార్డులతో చేసే ఖర్చుపై బ్యాంకులు క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్లు కూడా విద్యార్థులకు లభిస్తాయి.

6) అంతేకాకుండా విద్యార్థులు కావాలంటే కావాల్సిన పత్రాలను అందించడం ద్వారా తమ స్టూడెంట్ క్రెడిట్ కార్డును సాధారణ క్రెడిట్ కార్డుగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story