ప్రధాన నగరాల్లో 48 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!

by Aamani |   ( Updated:2023-05-14 12:01:44.0  )
ప్రధాన నగరాల్లో 48 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు కంటే 48 శాతం పెరిగి రూ. 3.47 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. అనరాక్ తాజా గణాంకాల ప్రకారం, 2021-22లో ఇళ్ల అమ్మకాల విలువ రూ. 2.35 లక్షల కోట్ల నుంచి రూ. 3.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సంఖ్యా పరంగా 2022-23లో 36 శాతం 3,79,095 యూనిట్లకు చేరాయి. దేశీయ స్థిరాస్తి రంగంలో మెరుగైన గిరాకీ సంకేతాలు కనిపిస్తున్నాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పూరి అన్నారు. ప్రధాన నగరాలకు సంబంధించి, న్యూఢిల్లీలో ఇళ్ల అమ్మకాలు 42 శాతం పెరిగి రూ. 50,620 కోట్లకు చేరుకున్నాయి. ముంబై మెట్రోలో అమ్మకాలు 46 శాతం పెరిగి రూ. 1,14,190 కోట్లకు, బెంగళూరులో 49 శాతం పెరిగి రూ. 38,870 కోట్లకు, పూణెలో 77 శాతం పెరిగి రూ. 44,730 కోట్లకు, హైదరాబాద్‌లో 50 శాతం వృద్ధితో రూ. 34,820 కోట్లకు, చెన్నైలో 24 శాతం పెరిగి రూ. 11,050 కోట్లకు, కోల్‌కతాలో 38 శాతం పెరిగి రూ. 10,660 కోట్లకు చేరుకున్నాయని అనరాక్ వెల్లడించింది. వినియోగదారులతో పాటు పెట్టుబడిదారుల నుంచి కూడా స్థిరాస్తి మార్కెట్‌కు డిమాండ్ పెరిగిందని లగ్జరీ రియల్టీ సంస్థ క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు.

Also Read..

పోయిన మొబైల్‌ఫోన్‌లను ట్రాక్ చేసేందుకు కొత్త వ్యవస్థ!

Advertisement

Next Story