వినియోగదారులకు షాక్ ఇచ్చిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ!

by Harish |
వినియోగదారులకు షాక్ ఇచ్చిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ!
X

న్యూఢిల్లీ: పెరిగిన ఖర్చుల భారాన్ని అధిగమించేందుకు ఎంపిక చేసిన కార్ల ధరలు పెంచుతున్నట్టు ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా బుధవారం ప్రకటించింది. కంపెనీ తన సెడాన్ మోడళ్లు సిటీ, అమేజ్‌ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది.

వాహన తయారీలో కీలక ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొంత భారాన్ని వినియోగదారులకు కూడా బదిలీ చేస్తున్నాం. పెరిగిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, వాహన వేరియంట్‌ని బట్టి పెరుగుదలలో మార్పు ఉంటుందని హోండా కార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ ఓ ప్రకటనలో చెప్పారు. ప్రస్తుతం హోండా అమేజ్ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.6 లక్షల మధ్య ఉండగా, సిటీ మోడల్ ధర రూ. 11.55 లక్షల నుంచి రూ. 20.39 లక్షల మధ్య ఉంది.

Advertisement

Next Story