కేవైసీ అప్‌డేట్ చేయని హై-బ్యాలెన్స్ ఖాతాలపై నిఘా!

by Prasanna |   ( Updated:2023-04-26 09:22:14.0  )
కేవైసీ అప్‌డేట్ చేయని హై-బ్యాలెన్స్ ఖాతాలపై నిఘా!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వం, ఆర్‌బీఐ నో-యువర్ కస్టమర్(కేవైసీ) వివరాలను అప్‌డేట్ చేయని అధిక సొమ్ము కలిగిన యాక్టివ్ ఖాతాలపై నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. వాటిలో ట్రస్టులు, అసోసియేషన్లు, సొసైటీలు, క్లబ్‌లు, హై-నెట్‌వర్త్ వ్యక్తులు(హెచ్ఎన్ఐ)కు చెందిన బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. కొన్ని బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించిన తర్వాత కేవైసీ అప్‌డేట్ జరగలేదని గుర్తించినట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి ఖాతాల వల్ల ఏమైనా రిస్క్‌ ఉందా అనే అంశాన్ని సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) 2023, జూన్ నాటికి యాక్టివ్ బ్యాంకు ఖాతాలను కలిగిన వినియోగదారులందరీ కేవైసీని అప్‌డేట్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని బ్యాంకులను ఆదేశించినట్టు సీనియర్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం ఆర్‌బీఐ కరోనా కారణంగా 2022, మార్చి వరకు నాన్-కేవైసీ ఖాతాలను ఫ్రీజ్ చేయకుండా బ్యాంకులను ఆదేశించింది. అయితే, ఆ తర్వాత వాటిలో కొన్ని ఖాతాలు పదే పదే అభ్యర్థించినప్పటికీ కేవీసీని అప్‌డేట్ చేయలేదని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం అలాంటి ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయవచ్చా లేదా అనే దానిపై ఆర్‌బీఐ నుంచి స్పష్టత కోరుతున్నట్టు మరో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చేలా పూర్తి సులభతర కేవైసీ ప్రక్రియను కలిగి ఉండేలా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు.

Also Read...

Bank Holiday in May 2023: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్

Advertisement

Next Story