'వీదా వీ1 ప్రో' ధరను రూ. 6 వేలు పెంచిన హీరో మోటోకార్ప్!

by Javid Pasha |
వీదా వీ1 ప్రో ధరను రూ. 6 వేలు పెంచిన హీరో మోటోకార్ప్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఈవీ స్కూటర్ ధరను భారీగా పెంచింది. జూన్ నెల నుంచి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలో కోత అమలవడంతో కంపెనీ తన వీదా వీ1 ప్రో ధరను ఏకంగా రూ. 6,000 పెంచుతూ నిర్ణయించింది. రాయితీ గణనీయంగా తగ్గిపోవడంతో పెరిగిన భారంలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ధరలను సవరించిన తర్వాత హీరో మోటోకార్ప్ వీదా వీ1 ప్రో ధర ప్రసుత్తం రూ. 1.45 లక్షలకు చేరుకుంది. ఈ మొత్తం ప్రభుత్వ ఫేమ్2 రాయితీ, పోర్టబుల్ ఛార్జర్ కలిపి నిర్ణయించిన ధర అని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్ట చేశారు.

అయితే, కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా, ఇటీవల కేంద్రం ఫేమ్2 రాయితీ పథకం ద్వారా ఈవీలకు అందించే సబ్సిడీని ఫ్యాక్టరీ ధరపై 40 శాతం ఇచ్చేంది. గత నెలలో దీన్ని సవరించి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వినియోగదారులు ఒక్కో వాహనంపై రూ. 32 వేల రాయితీని కోల్పోతున్నారని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే టీవీఎస్, ఓలా, ఏథర్ ఎనర్జీ తన ఈవీ స్కూటర్ల ధరను రూ. 17 వేల నుంచి రూ. 22 వేల వరకు పెంచాయి.

Advertisement

Next Story