- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలా ఈజీగా మీ CIBIL స్కోర్ తెలుసుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందొ తెలియదు. ముఖ్యంగా ఆర్థికపరమైన అవసరాలకు మాత్రం చేతిలో డబ్బులు లేక, ఇతరుల వద్ద నుంచి అప్పులు తీసుకుంటారు. ఇటీవల కాలంలో టెక్నాలజీ కారణంగా వివిధ అవసరాలకు లోన్స్/ అప్పులు పొందడానికి తెలిసిన వ్యక్తుల వద్ద నుంచి కాకుండా వివిధ యాప్స్, బ్యాంకులు ద్వారా లోన్స్ పొందడం జరుగుతుంది.
అయితే ఈ విధంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి లోన్ పొందడం అంటే అంత సులువు కాదు. దరఖాస్తుదారుని ఆధార్ వివరాలు, పాన్ కార్డు వివరాలు మొదలగునవి సమర్పించాలి. వీటన్నింటిని సదరు కంపెనీలు పూర్తిగా వెరిఫై చేశాక, దరఖాస్తుదారుని అత్యంత ముఖ్యమైన CIBIL స్కోర్ చూశాక లోన్స్ ఇవ్వాలా, వద్దా అని నిర్ణయిస్తాయి. CIBIL అనగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్(Credit Information Bureau (India) Limited).
CIBIL స్కోర్ వినియోగదారుడి క్రెడిట్ చరిత్రను సేకరిస్తుంది. దీనిని 2000 లో స్థాపించారు. బ్యాంకులు లేదా రుణదాతలు లోన్ తీసుకున్న వ్యక్తుల క్రెడిట్, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని CIBIL లో నమోదు చేస్తారు. ఇందులో రుణ ఖాతాలు లేదా క్రెడిట్ కార్డ్‌లు, చెల్లింపు స్థితిగతులు, బకాయి మొత్తం, గడువు తేదీ మొదలైనవి ఉంటాయి.
CIBIL స్కోర్ 900 కి దగ్గరగా ఉంటే, వినియోగదారు క్రెడిట్ కార్డు లేదా లోన్ అప్లికేషన్ ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా CIBIL స్కోర్ 700 పై ఉంటే రుణాలు త్వరగా మంజూరు అవుతాయి. అందుకే ప్రతి వినియోగదారుడు లోన్ తాలూకు డబ్బులు సమయానికి చెల్లించడం ద్వారా CIBIL ఎక్కువగా ఉండి కొత్త రుణాలు పొందడానికి అర్హత కలిగి ఉంటాడు.
CIBIL స్కోర్ తెలుసుకునే విధానం..
* అధికారికి వెబ్‌సైట్ https://www.cibil.com/ లోకి వెళ్లాలి.
* Get your CIBIL score ఎంచుకొవాలి.
* తరువాత పేరు, ఈ-మెయిల్ ఐడి, పిన్‌కొడ్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ తదితర వివరాలు నమోదు చేయాలి.
* తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు otp వస్తుంది.
* otp ఎంటర్ చేశాకా క్రెడిట్ స్కోర్ వస్తుంది.
* CIBIL score తెలుసుకొడానికి మరికొన్ని వెబ్‌సైట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించడం ఉత్తమం.
Read more: