- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HDFC Bank : రూ.16 వేల కోట్లకు HDFC బ్యాంక్ లాభం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ HDFC తన ఆర్థిక ఫలితాలను శనివారం విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ రూ.16,512 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 37.1 శాతం పెరిగింది. అదే గత త్రైమాసికంలో రూ.16,373 కోట్లతో పోలిస్తే 0.84 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 24.5 శాతం పెరిగి రూ.29,077 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఎ)త్రైమాసికంలో 1.26 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఎ 0.31 శాతంతో పోలిస్తే 0.33 శాతంగా ఉంది. వేతనాల పెంపుదల, పెన్షన్ కేటాయింపుల ప్రభావంతో వ్యయ ఒత్తిడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాంక్ రిటైల్ రుణాలలో గణనీయమైన పెరుగుదలను సాధించింది.వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 24.6 శాతం ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించగా, కార్పొరేట్,హోల్‌సేల్ రుణాలు 4.2 శాతం స్వల్పంగా వృద్ధి చెందాయి. 2024 మార్చి 31 నాటికి డిపాజిట్లు 26.4 శాతం, CASA డిపాజిట్లు 8.7 శాతం పెరిగాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 19.50 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించారు. ఈక్విటీ షేర్లపై డివిడెండ్ పొందేందుకు రికార్డు తేదీ మే 10, 2024. ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ మొత్తం లాభం రూ.64,060 కోట్లుగా ఉంది.
- Tags
- HDFC Bank