ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను గురించి జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం!

by Javid Pasha |
ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను గురించి జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం!
X

పుణె: ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను రేటుకు సంబంధించి ఈ నెల 11న జరిగే 50వ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఈ సమస్య చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. కాబట్టి కౌన్సిల్ దీనిపై చర్చ చేపట్టనుంది. అయితే, చట్టపరంగా ఇంకా స్పష్టత లేదు. అది రాష్ట్రాల చేతుల్లో ఉన్నందున పన్ను నిర్ణయంపై ఇప్పుడే చెప్పడం కష్టమని అధికారి అభిప్రాయపడ్డారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం గతేడాది డిసెంబర్‌లో సమర్పించిన నివేదికలో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

క్యాసినోలో ఆటగాడు కొనుగోలు చేసే చిప్స్‌/కాయిన్‌ పూర్తి ముఖవిలువపై పన్ను వసూలు చేయాలని కోరింది. ఈ పరిస్థితుల్లో చర్చల ఫలితాలను అంచనా వేయలేమని, రాష్ట్రాలకు సంబంధించినదని అన్నారు. కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ గేమింగ్ నుంచి వచ్చే ఆదాయం వల్ల పన్ను పెంచేందుకు అభ్యంతరం చెప్పవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Next Story