- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
12 శాతం పెరిగిన జీఎస్జీ వసూళ్లు!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదు అయ్యాయి. గడిచిన మే నెలలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగినట్లు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే నెలకు గాను మొత్తం రూ.1,57,090 కోట్లు వసూలు కాగా గత ఏడాది ఈ మొత్తం రూ. 1,40,885 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ. 28,411 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ కింద రూ. 35,828 కోట్లు. ఐజీజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
సెస్ ల రూపంలో మరో రూ.11,489 కోట్లు వసూలైనట్లు వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను భారీగా జీఎస్టీ వసూళ్లు నమోదు అయ్యాయి. తెలంగాణ గతేడాది మే లో రూ.3,982 కోట్లు వసూలు కాగా ఈ ఏడాది మే లో రూ.4,507 నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తెలంగాణలో జీఎస్టీ వసుళ్ల వృద్ధి 13 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గతేడాది రూ.3,047 కోట్లు వసులు కాగా ఈ ఏడాది మే లో 3,373 కోట్లు వసూలైంది. ఈ ఏడాది ఏపీలో 11 శాతం జీఎస్టీ వసూళ్లు నమోదు అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
Also Read..
ఒక్క క్లిక్‌తో మీరు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులో ఇలా తెలుసుకోండి