24 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!

by srinivas |
24 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం వృద్ధి చెందినట్టు కేంద్ర పన్నుల విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2022, ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం రూ. 8.98 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు నమోదయ్యాయని పన్నుల శాఖ ఆదివారం తెలిపింది. ఇందులో వ్యవక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 32 శాతం, కార్పొరేట్ పన్నులు 17 శాతం పెరిగాయి. రీఫండ్లు చెల్లించిన అనంతరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల లక్ష్యం అంచనాల్లో 52.46 శాతానికి సమానం. గతేడాది ఇదే సమయంలో వసూలైన మొత్తంతో పోలిస్తే 16.3 శాతం వృద్ధి. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం(2021-22) వసూలైన రూ. 14.10 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఇక, సమీక్షించిన కాలంలో మొత్తం రూ. 1.53 లక్షల కోట్ల రీఫంద్లు చేసినట్టు పన్నుల విభాగం ప్రకటించింది. ఇది కూడా గతేడాదితో పోలిస్తే 81 శాతం పెరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed