- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విదేశీ డ్రోన్‌లపై నిషేధం.. వాటికి మాత్రం అనుమతి అక్కర్లేదు..!
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నేళ్లలో వివిధ కార్యక్రమాలు, వేడుకలకు డ్రోన్‌ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం వ్యవసాయం మొదలుకుని అనేక రంగాల్లో వీటి వినియోగం పుంజుకుంటోంది. అయితే తాజాగా కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే డ్రోన్‌లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో రక్షణ, భద్రత, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్అండ్‌డీ) ప్రయోజనాల కోసం మినహా అన్ని విదేశీ తయారీ డ్రోన్‌ల దిగుమతిని ప్రభుత్వం నిషేధించింది. 'మేక్ ఇన్ ఇండియా' పథకంలో భాగంగా స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఇదే సమయంలో డ్రోన్ విడిభాగాల దిగుమతికి మునుపటిలా అనుమతి ఉంటుందని, వాటికి ఎలాంటి ఆమోదం అవసరం లేదని పేర్కొంది. దీనికి సంబంధించి డైరెక్టర్‌రేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తాజా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 2030 నాటికి భారత్‌ను డ్రోన్ హబ్‌గా మార్చేందుకు గత సెప్టెంబర్‌లో కేంద్రం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా డ్రోన్‌లు, డ్రోన్ విడిభాగాల తయారీదారులకు 20 శాతం వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం మూడేళ్ల కాలవ్యవధితో రూ. 120 కోట్లను కేటాయించింది.