బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభం తర్వాత ఎన్ఎండీసీ స్టీల్ ప్రైవేటీకరణ!

by Vinod kumar |
బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభం తర్వాత ఎన్ఎండీసీ స్టీల్ ప్రైవేటీకరణ!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ స్టీల్‌ను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వ ఆర్థిక బిడ్‌లను ఆహ్వానించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని కంపెనీ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించే ప్రక్రియ జరుగుతోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీ విలువ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్ఎండీసీ స్టీల్ ఏడాది 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా. దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే ఎన్ఎండీసీ నుంచి విడిపోయిన తర్వాత ఎన్ఎండీసీ స్టీల్‌లో ప్రభుత్వం 60.79 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 39.21 శాతం పబ్లిక్ హోల్డింగ్ ఉంది. నిర్వహణ బాధ్యలతో పాటు 50.79 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక బిడ్‌లను స్వీకరించింది.

ఉక్కు కర్మాగారానికి ముఖ్యమైన బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించి, ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం ఎన్ఎండీసీ విలువను లెక్కగట్టనుంది. సంస్థ సామర్థ్యం గురించి పెట్టుబడిదారుల విశ్వాసం పొందిన తర్వాతే ప్రభుత్వం ఆర్థిక బిడ్లను ఆహ్వానించనుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 30.25 వద్ద స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన ఎన్ఎండీసీ స్టీల్ ప్రస్తుతం రూ. 44 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత్ మార్కెట్ ధర ప్రకారం 50.79 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 6,500 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed