ఏప్రిల్ నుంచి ఎక్స్‌రే యంత్రాలు, ఇతర పరికరాలపై కస్టమ్స్ సుంకం పెంపు!

by Mahesh |
ఏప్రిల్ నుంచి ఎక్స్‌రే యంత్రాలు, ఇతర పరికరాలపై కస్టమ్స్ సుంకం పెంపు!
X

న్యూఢిల్లీ: ఎక్స్‌రే యంత్రాలు, నాన్-పోర్టబుల్ ఎక్స్‌రే జనరేటర్ల దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. ఏప్రిల్ 1 నుంచి వీటి దిగుమతులపై సుంకం 10 శాతం నుంచి 15 శాతానికి పెరుగుతుంది. గతవారం లోక్‌సభలో ఆమోదించిన ఆర్థిక బిల్లు-2023 సవరణలో భాగంగా పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాలు, నాన్-పోర్టబుల్ ఎక్స్-రే జనరేటర్లు, పరికరాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌లో తయారీకి ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. కస్టమ్స్ సుంకం పెంపుతో ఆయా పరికరాల దిగుమతులు తగ్గి మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి మరింత చేరువ అయ్యేందుకు వీలవుతుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ వెల్లడించారు.

Advertisement

Next Story