- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌కు మైనారిటీ వాటా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో వాటాను కొనుగోలు చేయనుంది. తాజా ఫండింగ్ రౌండ్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు వాల్‌మార్ట్ గ్రూప్ శుక్రవారం ప్రకటించింది. నియంత్రణ సంస్థల అనుమతుల ఆధారంగా మైనారిటీ భాగస్వామిగా గూగుల్‌ను చేర్చుకోనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దేశీయంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ పెట్టుబడులతో పాటు కంపెనీ క్లౌడ్ సహకారం మా వ్యాపారాన్ని విస్తరించడం, దేశవ్యాప్తంగా వినియోగదారులకు సేవలు అందించడం, డిజిటల్ మౌలిక సదుపాయాలు ఆధునికీకరించడంలో సాయపడతాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే, గూగుల్ ఎంత మొత్తం పెట్టుబడి పెట్టనుందనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.