Google: గూగుల్​కు భారీ ఫైన్ విధించిన యూరోపియన్ కోర్ట్.. ఎందుకంటే..!

by Maddikunta Saikiran |
Google: గూగుల్​కు భారీ ఫైన్ విధించిన యూరోపియన్ కోర్ట్.. ఎందుకంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్​ గూగుల్(Google)​కు భారీ ఫైన్(Fine) పడింది. ఓ స్మాల్ వెబ్‌సైట్(Small Website) మీద గూగుల్ చూపిన నిర్లక్ష్యం వాళ్ళ ఆ సంస్థ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. వివరాల్లోకెళ్తే.. యూకే(UK)కు చెందిన శివన్(Shivan), ఆడమ్ రాఫ్(Adam Roff) జంట 2006లో 'ఫౌండెమ్(Foundem)' అనే వెబ్‌సైట్ స్టార్ట్ చేశారు. ఈ వెబ్‌సైట్ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్ ప్రైస్(Product Price)లను కంపేర్ చేస్తుంది. అయితే దీన్ని వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత గూగుల్ సెర్చ్(Google Search) లో క్రమక్రమంగా విజిబిలిటీ తగ్గడం మొదలైంది. ప్రజలు షాపింగ్(Shopping), ప్రైస్ కంపారిజాన్(Price Comparison) వంటి కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ లో వెతికినప్పటికీ వెబ్‌సైట్ కనిపించకపోవడాన్ని శివన్, ఆడమ్ రాఫ్ కని పెట్టారు.

గూగుల్​కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్(Automated Spam Filters) విధించిన పెనాల్టీ కారణంగా తమ వెబ్‌సైట్ పడిపోతుండటాన్ని ఫౌండర్స్ గమనించారు. ఈ విషయాన్ని గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్ రెండేళ్ళైనా ఆ పెనాల్టీని తొలగించలేదు. దీంతో వారు చేసేదేమీ లేక 2010లో యూరోపియన్ కమిషన్(European Commission)ను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ అధికారులు దర్యాప్తు చేసి.. గూగుల్ కంపెనీ తన షాపింగ్ సర్వీసును ప్రమోట్ చేసుకోవడానికే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవరించి అన్యాయం చేసిందని గుర్తించింది. దీంతో కమిషన్ గూగుల్ సంస్థకు 2.4 బిలియన్ ఫౌండ్స్ (దాదాపు రూ. 26వేల కోట్లు) జరిమానా విధిస్తూ 2017లో తీర్పునిచ్చింది. దీనిపై గూగుల్ అప్పీల్(Appeal)కు వెళ్ళింది. దాదాపు ఏడు సంవత్సరాల తరువాత కమిషన్ ఇచ్చిన తీర్పును 2024లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(European Court of Justice) సమర్థించింది. తీర్పు చాలా ఆలస్యమైనా.. తమ సుదీర్ఘ న్యాయ పోరాటానికి ఫలితం దక్కిందని శివన్, ఆడమ్ రాఫ్ అన్నారు.


Advertisement

Next Story

Most Viewed