SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్: రూ. 25 వేల వరకు భారీ ఆఫర్లు

by Harish |
SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్: రూ. 25 వేల వరకు భారీ ఆఫర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు ఈ పండగ సమయంలో ప్రత్యేకమైన తగ్గింపులు సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల బ్రాండ్లను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే తగ్గింపులు, డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

మరి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా వివిధ ప్రోడక్ట్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం..

* హోండా బైక్ కొనుగోలుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఒక కార్డు ద్వారా గరిష్టంగా రూ. 5 వేల తగ్గింపు వస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 40 వేలు. ఇది ఈఎంఐ లావాదేవీలకు వర్తిస్తుంది

* ఎల్‌జీ ఉత్పత్తులపై ఒక కార్డు ద్వారా గరిష్టంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే, 22.5 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. ఈఎంఐ లావాదేవీలకు వర్తిస్తుంది

* ఒప్పొ ప్రొడక్టులపై ఈఎంఐ లావాదేవీల ద్వారా రూ. 5 వేల వరకు, శాంసంగ్ ప్రొడక్టులపై రూ. 25 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది.

* ఈజీ మై ట్రిప్ ద్వారా డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్‌పై 12 శాతం తగ్గింపు, ఒక కార్డుపై గరిష్టంగా రూ. 1500 వరకు తగ్గింపు ఉంది. ఈ ఆఫర్ మార్చి 26 వరకు ఉంటుంది.

* ఓయో బుకింగ్స్‌పై 10 శాతం అదనపు తగ్గింపు, ఒక కార్డుపై రూ. 500 వరకు డిస్కౌంట్ వస్తుంది. మంగళవారం, బుధవారం మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. మార్చి 29 వరకు ఉంటుంది.

* క్లియర్ ట్రిప్ ద్వారా డొమెస్టిక్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే 12 శాతం తగ్గింపు. ఒక కార్డుపై రూ.2 వేల వరకు తగ్గింపు వస్తుంది. ప్రతి శనివారం రోజున మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఇది మార్చి 25 వరకు అందుబాటులో ఉంటుంది.

* వీ మార్ట్‌లో షాపింగ్‌పై 5 శాతం డిస్కౌంట్, ఒక కార్డుపై గరిష్టంగా రూ. 1000 వరకు తగ్గింపు వస్తుంది. ఇది ఏప్రిల్ 4 వరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Next Story