పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మళ్లీ మార్కెట్లోకి పల్సర్ 220F

by Harish |   ( Updated:2023-02-21 17:31:04.0  )
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మళ్లీ మార్కెట్లోకి పల్సర్ 220F
X

దిశ, వెబ్‌డెస్క్: బైక్ లవర్స్‌కు ఎంతో ఇష్టమైన లెజెండరీ బజాజ్ పల్సర్ 220F ను కంపెనీ తిరిగి మార్కెట్లో మళ్లీ లాంచ్ చేసింది. ఎక్స్-షోరూమ్ రూ. 1,39,686 ప్రారంభ ధరతో తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ బైక్‌కు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరినాటికి ప్రారంభమవుతాయి.

పల్సర్ 220F మోడల్‌ను 2007 లో లాంచ్ చేశారు. అప్పట్లో దీనికి విపరీతమైన క్రేజ్ ఉండేది. తరువాత బజాజ్ కంపెనీ ఈ మోడల్‌పై దృష్టి పెట్టకుండా N250, F250లను లాంచ్ చేసింది. కానీ ఈ మోడళ్లు అంతగా క్లిక్ కాలేదు. దీంతో సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ పల్సర్ 220F మోడల్‌ను తిరిగి తీసుకువచ్చింది.


ప్రస్తుతం లాంచ్ అయిన కొత్త పల్సర్ 220F పాత డిజైన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీనిలో కొత్తగా ఏం మార్పులు చేయలేదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్, డబుల్-క్రెడిల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్, V-ఆకారపు LED హెడ్‌లైట్ క్లస్టర్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్‌లు ఉన్నాయి. బైక్ బ్లాక్-రెడ్, బ్లాక్-బ్లూ కలర్ కాంబినేషన్‌లో రావచ్చిని తెలుస్తోంది. 21 బిహెచ్‌పి పవర్, 19ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. డిస్క్ బ్రేకులు, సింగిల్ ఛానల్ ABS‌తో రానుంది.

Advertisement

Next Story